ఇండియన్ 2 (Indian2).. ఈ సినిమాను మేకర్స్ దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్తో నాలుగేళ్ల పాటు తెరకెక్కించిన.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. కమల్ హాసన్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి వచ్చింది కేవలం రూ.150 కోట్ల కలెక్షన్ల లోపే. అది కూడా గ్రాస్ కలెక్షన్స్.. షేర్ అంతకు తక్కువే! ఇక ఆ లెక్కన చూస్తే నిర్మాతలకు సుమారు రూ.100 కోట్లకుపైనే నష్టాలు మిగిల్చింది.
కాగా ఇండియన్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్ ఇండియన్ 3 (Indian3)పై గట్టిగానే పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇండియన్ 3 మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు..ఇపుడు సోషల్ మీడియాలో #Indian3 అని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇండియన్ 2 థియేటర్లో రిలీజై కథ, కథనాలు, డైరెక్టర్ మేకింగ్ స్టైల్ ఆడియన్స్ కి ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఇండియన్ 3 కి బాగా ఎఫెక్ట్ పడింది. ఇక ఇండియన్ 2 మూవీ చివర్లో ఇండియన్ 3కి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ చూపించిన అంతగా ఏం లేకపోవడంతో.. ఇక పార్ట్ 3ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారట.
ALSO READ | రజనీకాంత్ Vs అమితాబ్ బచ్చన్.. న్యాయం చేయడంలో ఎవరి వెర్షన్ కరెక్ట్!
అందుకు ఇప్పటికే నెట్ఫ్లిక్స్ తో చర్చలు కూడా కంప్లీట్ అయ్యాయట. ఇక కమల్, శంకర్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్సీ రేట్ కే ఇండియన్ 3 ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది 2025 జనవరిలో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
అయితే, ఇప్పటికే ఇండియన్ 3కు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బ్యాలెన్స్‌గా ఉన్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం కమల్ హాసన్ దిగ్గజ మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'థగ్ లైఫ్'మూవీలో నటిస్తున్నాడు. ఇక డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్, ఇండియన్ 3 పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.