ఇద్దరు హీరోయిన్స్‌‌ ఉన్నా.. ఒక్కరు నాకు ఐ లవ్‌‌ యూ చెప్పలే: కమల్ హాసన్‌

ఇద్దరు హీరోయిన్స్‌‌ ఉన్నా.. ఒక్కరు నాకు ఐ లవ్‌‌ యూ చెప్పలే: కమల్ హాసన్‌

కమల్ హాసన్‌‌ లీడ్‌‌ రోల్‌‌లో మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్‌‌ లైఫ్‌‌’.శింబు కీలక పాత్ర పోషిస్తుండగా త్రిష, అభిరామి హీరోయిన్స్‌‌. ఏ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌‌ను లాంచ్ చేశారు.

కమల్ ఈ పాటకు లిరిక్స్ రాశారు. పెళ్లి వేడుక నేపథ్యంలో చిత్రీకరించిన ఈ  పాటలో కమల్‌‌తో పాటు శింబు, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్‌‌, తనికెళ్ల భరణి, నాజర్, అలీ ఫజల్, సన్యా మల్హోత్రా కనిపించారు.

ఇక చెన్నైలో జరిగిన సాంగ్‌‌ లాంచ్ ఈవెంట్‌‌లో కమల్ మాట్లాడుతూ ‘37 ఏళ్ల తర్వాత మళ్లీ మణిరత్నం డైరెక్షన్‌‌లో నటించడం హ్యాపీ.  నిజానికి ‘నాయకన్‌‌’తర్వాత చాలాసార్లు కలిసి పనిచేయాలని చర్చించాం. కానీ మేం ఎస్‌‌ చెప్పినపుడు మార్కెట్ నో చెప్పింది. ఫైనల్‌‌గా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌‌ లేవనెత్తిన అన్ని ప్రశ్నలను అధిగమించి మా రీయూనియన్‌‌కు స్పేస్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌‌.  ఈ ఆలస్యానికి సారీ. ఇక ఈ మూవీ స్టోరీ డిస్కషన్స్‌‌ జరిగేటప్పుడే 35 శాతం సినిమా పూర్తయింది అనిపించింది.

ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో షూటింగ్ మొదలయ్యేది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్‌‌ ఉన్నా ఒక్కరు కూడా నాకు ఐ లవ్‌‌ యూ చెప్పలేదు.. జోజూ మాత్రం డైలీ ఐ లవ్ యూ చెప్పేవాడు (నవ్వుతూ)’అన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ కమల్‌‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు మణిరత్నం.

కమల్ హాసన్‌‌ లాంటి లెజెండరీ యాక్టర్‌‌‌‌తో నటించడం అదృష్టంగా భావిస్తున్నామని త్రిష,  శింబు, అభిరామి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని పాటల్లో ఓ మేజిక్ ఉందని, నాలుగు నెలలుగా ఈ సినిమాపైనే పూర్తిగా వర్క్ చేస్తున్నానని రహమాన్ చెప్పారు.  రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, ఆర్. మహేంద్రన్, మద్రాస్ టాకీస్, శివ అనంత్ నిర్మించిన ఈ చిత్రం జూన్‌‌ 5న విడుదల  కానుంది.