CHaruhasan: ఆసుపత్రిలో చేరిన కమల్‌హాసన్‌ సోదరుడు చారు హాసన్


 ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌  సోదరుడు,  సీనియర్‌ నటుడు, దర్శకుడు చారుహాసన్‌ అస్వస్థతకు గురయ్యారు. అక్టోబర్ 31న రాత్రి ఆయన అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు వెంటనే  చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె  నటి సుహాసిని మణిరత్నం ఇన్‌స్టాగ్రామ్‌లో  వెల్లడించారు.  చారుహాసన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

దీపావళి ముందు అక్టోబర్ 31న  అర్ధరాత్రి  మా నాన్న అస్వస్థకు గురయ్యారు. మా దీపావళి  ఎమర్జెన్సీ వార్డులోనే గడిచింది.  మా నాన్న సర్జరీకి సిద్దమవుతున్నారని పోస్ట్ చేశారు.

 చారుహాసన్  2024 ఆగస్టులో కూడా వృద్ధాప్య సమస్యల కారణంగా  ఆస్పత్రిలో చేరారు. చారుహాసన్ తెలుగు, కన్నడ, మలయాళం,తమిళ్ లో పలు సినిమాలను డైరెక్ట్ చేశారు.  చారుహాసన్, చంద్రహాసన్, కమల్ హాసన్ ముగ్గురు సోదరులు. చారుహాసన్ కు ముగ్గురు కుమార్తెలు సుహాసిని, నందిని, సుభాషిని ఉన్నారు.

Also Read : ఆకట్టుకుంటున్న జై హనుమాన్ థీమ్ సాంగ్..