విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా జూన్ 3న (శుక్రవారం) విడుదలకానుంది. ఈనేపథ్యంలో ఆ మూవీ ట్రైలర్ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్లోని ‘బుర్జ్ ఖలీఫా’ స్క్రీన్ పై విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘బుర్జ్ ఖలీఫా’ స్క్రీన్ పై ప్రదర్శితమైన ‘విక్రమ్’ మూవీ సీన్లను.. కమల్ హాసన్ అక్కడే కూర్చొని తిలకించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక సీన్ లో హీరో సూర్య కూడా కనిపించనున్నారు.ఇందుకు సంబంధించి ఇటీవల ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అందులో సూర్య కళ్లు మాత్రమే కనిపిస్తాయి. ‘విక్రమ్’.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇది ప్రీ రిలీజ్ వ్యాపారంలోనే దాదాపు రూ.200 కోట్లను ఆర్జించింది. బిస్లేరీ, స్పాటిఫై లాంటి కంపెనీలతోనూ చేతులు కలిపి మరీ విక్రమ్ మూవీని ప్రమోట్ చేశారు.
మరిన్ని వార్తలు..