బీజేపీలో చేరనున్నారన్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ స్పందించారు. బీజేపీలో చేరడం లేదని, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ అనంతరం కమల్ నాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు .
కమల్ నాథ్ ఆయన కుమారుడు, లోక్‌సభ ఎంపీ నకుల్ నాథ్ తో కలిసి బీజేపీలో చేరనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న క్రమంలో ఈ స్పష్టత వచ్చింది. గాంధీ కుటుంబంతో కమల్ నాథ్ కు ఉన్న అనుబంధం తిరుగులేనిదని, ఆయన కాంగ్రెస్ భావజాలంతో జీవించారని, చివరి వరకు కాంగ్రెస్‌తోనే ఉంటారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ అన్నారు.
బీజేపీ మీడియాను దుర్వినియోగం చేస్తుందన్న ఆయన.. ఒక వ్యక్తి యొక్క చిత్తశుద్ధిని ప్రశ్నిస్తుందన్నారు. మీడియాలో వస్తున్న కథనాలు కుట్రలో భాగమేనని కమల్‌నాథ్‌తో తనతో చెప్పినట్లుగా వెల్లడించారు.