టిమ్​ వాల్జ్​నే అమెరికా కోరుకుంటుంది

టిమ్​ వాల్జ్​నే అమెరికా కోరుకుంటుంది
  •  మిన్నెసోటా గవర్నర్​గా నిరూపించుకుండు:కమలా హారిస్​
  • ఉపాధ్యక్ష అభ్యర్థి వాల్జ్​తోకలిసి ఫిలడెల్ఫియాలో ప్రచారం

ఫిలడెల్ఫియా: అమెరికా వైస్ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తమ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశంసించారు. మిన్నెసోటా గవర్నర్ గా, ఆర్మీ నేషనల్ గార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాల్జ్ తనను తాను నిరూపించుకున్నారని తెలిపారు. ఆయన ట్రాక్​ రికార్డు ప్రజలు పెద్ద కలలు కనేలా స్ఫూర్తినిస్తుందని చెప్పారు. మంగళవారం రాత్రి పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్పియాలో కమల, వాల్జ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.

వాల్జ్​ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యాక వారిద్దరు కలిసి పాల్గొన్న మొదటి ఎన్నికల ప్రచారం ఇదే. సభలో కమల మాట్లాడుతూ “ప్రజలంతా తమ వాడుగా భావించే వ్యక్తి వాల్జ్, వారు పెద్దపెద్ద కలలు కనేందుకు ఆయనొక స్ఫూర్తి. ఉపాధ్యక్షుడిగా ఇలాంటి వ్యక్తినే అమెరికా కోరుకుంటుంది” అని అన్నారు. టీచర్​గా, కోచ్​గా, కాంగ్రెస్​సభ్యుడిగా, గవర్నర్​గా విభిన్న పాత్రలు సమర్థంగా పోషించారని.. నవంబర్​5 తర్వాత ఆయన అమెరికా ఉపాధ్యక్షుడు కూడా అవుతారని పేర్కొన్నారు.

వాల్జ్ మాట్లాడుతూ అమెరికాలోని నెబ్రెస్కా అనే చిన్న టౌన్ నుంచి వచ్చానని.. 24 ఏండ్లుగా ఆర్మీ నేషనల్ గార్డ్​గా.. సోషల్​ టీచర్​గా, ఫుట్​బాల్ కోచ్​గా సేవలందించానని చెప్పారు. మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో దేశాన్ని విభజించే చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘ట్రంప్ ​చట్టాలను తుంగలోతొక్కాడు, దేశాన్ని గందరగోళం చేశాడు, కరోనాను సమర్థంగా ఎదుర్కొలేకపోయాడు. ఆర్థిక వ్యవస్థను పాతాళానికి పడేశాడు, ఆయన హయాంలో నేరాలు పెరిగాయి” అని విమర్శించారు.

ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హత్యకు కుట్ర.. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తి అరెస్టు

డోనాల్డ్ ట్రంప్​ హత్యకు కుట్ర పన్నిన పాక్​ దేశస్తుడిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్​(ఎఫ్​బీఐ) అరెస్టు చేసింది. మంగళవారం ఎఫ్​బీఐ చీఫ్ క్రిస్టోఫర్ వ్రే మీడియాతో మాట్లాడుతూ ట్రంప్​ హత్యకు కుట్ర పన్నడం, ఆందోళనలతో దేశంలో అలజడి సృష్టించడం వంటి నేరారోపణలపై ఆసిఫ్ మర్చంట్ అనే పాకిస్తాన్ వ్యక్తిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ కుట్రలో ఇంకెవరెవరు ఉన్న విషయం ఎంక్వైరీలో తెలుస్తుందని అన్నారు. 2020లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానిని అమెరికా హతమార్చింది. అప్పుడు ప్రెసిడెంట్​గా ఉన్న ట్రంప్ ఈ హత్యకు ఆదేశాలు ఇచ్చారని ఆసిఫ్ హత్యకు పగ పెంచుకున్నారు.

వైట్ హౌస్​లో కొకైన్..దర్యాప్తుపై అనుమానాలు

గత ఏడాది వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దొరికిన కొకైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023 జూలై 2న వైట్ హౌస్​లోని సిట్యుయేషన్ రూమ్ సమీపంలోని లాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొకైన్ దొరికింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ అనుమానితులను ఎంక్వైరీ చేయకుండానే 11 రోజుల్లో దర్యాప్తును ముగించింది. అలాగే దొరికిని కొకైన్ ను ధ్వంసం చేసింది. అయితే ప్రస్తుతం ఎన్నికల ముందు ఇది వివాదాస్పదంగా మారుతున్నది. ప్రెసిడెంట్ బైడెన్ కొడుకులు హంటర్, యాష్లే బైడెన్ కొకైన్ వినయోగంతో వచ్చే సమస్యలను ఎదుర్కొంటున్నారు.