ప్రాసిక్యూటర్‌‌ కావాలా..దోషి కావాలా : కమలా హ్యారిస్

ప్రాసిక్యూటర్‌‌ కావాలా..దోషి కావాలా  : కమలా హ్యారిస్
  • ప్రచార ర్యాలీలో కమలా హ్యారిస్ వ్యాఖ్య

వాషింగ్టన్: అమెరికా  ప్రెసిడెంట్ అభ్యర్థి రేసులో ఉన్న డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు కమలా హ్యారిస్ బుధవారం మొదటిసారి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విస్కాన్సిన్‌‌లోని మిల్వాకీలో మాట్లాడుతూ.. రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ఇవి మాజీ ప్రాసిక్యూటర్​కు, ఓ దోషికి మధ్య జరుగుతున్న ఎన్నికలు.

ఎవరిని ఎంచుకోవాలో అమెరికన్ ప్రజలే నిర్ణయించుకోవాలి. నేను ప్రాసిక్యూటర్‌‌గా పనిచేసిన కాలంలో అన్ని రకాల నేరస్తులను చూశాను. అందులో మహిళలను వేధించేవారు, వినియోగదారులను చీట్ చేసేవారు ఉన్నారు. కాబట్టి నా మాట వినండి. నాకు ట్రంప్ లాంటి వ్యక్తుల గురించి బాగా తెలుసు. ఆయనతో దేశానికి ప్రయోజనం ఉండదు’’ అని  ఆమె ఆరోపించారు.