పిరికివాళ్లే అలా మాట్లాడుతరు : ట్రంప్‌కు కమల కౌంటర్‌

పిరికివాళ్లే అలా మాట్లాడుతరు : ట్రంప్‌కు కమల కౌంటర్‌

న్యూయార్క్‌: రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ స్ట్రాంగ్ కౌంటర్​ఇచ్చారు. పిరికివాళ్లే అలా మాట్లాడుతారని ఆమె ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. తన రన్నింగ్‌మేట్‌ టిమ్‌ వాజ్‌తో కలిసి కమలా హారిస్‌ పెన్సిల్వేనియా ర్యాలీలో మాట్లాడారు.

ఇటీవలి కాలంలో రాజకీయాల్లో వక్రబుద్ధి కన్పిస్తోంది. ఎదుటివారిని దెబ్బ కొట్టడం అనేది ఒక నాయకుడి చతురత మీద ఆధారపడి ఉంటుంది. ప్రజల జీవితాల బాగు కోసం ఆలోచించేవారే నిజమైన లీడర్లు. ఇతరులను తక్కువ చేసి చేసి మాట్లాడే వారంతా పిరికివాళ్లే’ అని ట్రంప్‌కు కమల కౌంటర్‌ ఇచ్చారు..