కరోనా వ్యాక్సిన్ తీసుకున్నకమలా హారిస్

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నకమలా హారిస్
అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వాషింగ్టన్ డీసీలోని యునైటెడ్ మెడికల్ సెంటర్ లో మోడెర్నా వ్యాక్సిన్ ను డాక్టర్లు  ఇచ్చారు.. వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టీకా తీసుకున్నానన్నారు హారిస్. వ్యాక్సిన్ సురక్షితమని, దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి నొప్పి ఉండదని చెప్పారు. రెండో డోసు కూడా తీసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. అమెరికాలో కరోనా వ్యాక్సిన్ ఫైజర్ మోడెర్నాకు అనుమతి ఇచ్చాక ఆ దేశ కొత్త అధ్యక్షుడు జో బైడెన్, అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌసీ వంటి వారు టీకా తీసున్నారు. వ్యాక్సిన్ పై ప్రజలకు భరోసా కల్పించారు. వీరందరికీ త్వరలోనే రెండో డోసు ఇవ్వనున్నారు. 2020 అద్భుతమైన పాఠాలు నేర్పింది