ఏసీబీకి చిక్కిన కమలాపూర్ ఎమ్మార్వో మాధవీ

ఏసీబీకి చిక్కిన కమలాపూర్ ఎమ్మార్వో మాధవీ

అవినీతి నిరోదక శాఖ(ఏసీబీకి) మరో రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల తహసీల్దార్ మాధవి ఏసీబీకి చిక్కారు. ధరణి ఆపరేటర్ ద్వారా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నారు అధికారులు. కన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ ఈ నెల 9న  మీసేవాలో విరాసత్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గోపాల్ నుంచి 30 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు ఎమ్మార్వో మాధవీ. ఎమ్మార్వోతో పాటు ధరణి ఆపరేటర్ రాకేశ్ రూ.5 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు.

 పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన అధికారులు..  ఎమ్మార్వో మాధవి రూ. 5వేలు, ధరణి ఆపరేటర్ వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ ఎమ్మార్వోపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య. 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు గ్రామ పంచాయతీ సెక్రటరీ రాధిక, బిల్ కలెక్టర్ బాలరాజ్. రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నానాజీపూర్ గ్రామ పంచాయితీ ఆఫీస్ లో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు సెక్రటరీ రాధిక, బిల్ కలెక్టర్ బాలరాజ్ నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.