రాష్ట్రస్థాయి టోర్నమెంట్​కు కమలాపురం స్టూడెంట్స్

ములకలపల్లి, వెలుగు : కబడ్డీ, ఖోఖో, వాలీబాల్​ లో కలిపి మండలంలోని కమలాపురం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి 15 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కు ఎంపికయ్యారు. కిన్నెరసానిలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగిన జిల్లా స్థాయి గిరిజన క్రీడా పోటీలలో కమలాపురం ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

వీరంతా జనవరి 4, 5, 6 తేదీల్లో భద్రాచలంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఆదివారం స్కూల్​ హెడ్మాస్టర్​ వెంకటేశ్వర్లు, పీఈటీ, టీచర్లు వీరభద్రం, నరసింహ పోటీలకు ఎంపికైన స్టూడెంట్స్​ను అభినందించారు.