రెగ్యులర్ హారర్ సినిమాలకు పూర్తి డిఫరెంట్‌గా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ‘కింగ్‌స్టన్’ అనే హారర్ అడ్వెంచర్ సినిమా వస్తోంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రమిది. కమల్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్. జీ స్టూడియోస్‌తో కలిసి జీవీ ప్రకాష్ నిర్మిస్తున్నాడు.
ఈ మూవీ ఓపెనింగ్‌లో పాల్గొని ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టిన కమల్ హాసన్.. టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ‘నిర్మాత కావాలనేది నా చిరకాల కోరిక. అందుకు తగ్గ కథ కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా. ఈ స్క్రిప్ట్ విన్నాక పిల్లల నుండి పెద్దలవరకూ అందరినీ ఆకట్టుకుంటుంది అనిపించి చిత్ర నిర్మాణం మొదలుపెట్టాను’ అని చెప్పాడు.