బిగ్బాస్ కొత్త సీజన్ కోసం కమల్ భారీ రెమ్యునరేషన్

బిగ్బాస్(BiggBoss) షో ఇండియాలోనే  అత్యంత పాపులారిటీ  పొందిన టెలివిజన్ షోలలో ఒకటి. తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్( Kamal Haasan) హోస్ట్ చేస్తున్న ఈ బిగ్ బాస్.. ఫ్యాన్స్ కు చాలా స్పెషల్. ఎందుకంటే.. కేవలం కమల్ కోసం ఈ షో చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. కనుకే.. ఈ షోకు గత 6 సీజన్‌లుగా కమల్ హాసన్  హోస్ట్ గా ఉన్నారు.

ALSO READ:కొబ్బరి నీళ్లలో మత్తుమందు కలిపి.. ఐటీ రిటైర్డ్ కమిషనర్ ఇంట్లో భారీ చోరీ

తాజాగా మొదలుకానున్న బిగ్ బాస్-7 తమిళ సీజన్ కోసం కమల్ భారీగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆగస్టు నుండి స్టార్ట్ కాబోతున్న ఈ షో కోసం దాదాపు రూ.130 కోట్లు తీసుకోనున్నట్లు తమిళ నాట వినిపిస్తోంది. దీంతో ఈ షో పై భారీ హైప్ క్రీయేట్ అయ్యింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సీజన్ మొదలవుతుందా అని ప్రేక్షకులు కూడా తెగ ఎదురుచూస్తున్నారు.