
ఝరాసంగం,వెలుగు: శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి కల్యాణం ఆదివారం ఘనంగా జరిగింది. అమావాస్య కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయమే ఆలయ అర్చకులు అగ్ని ప్రతిష్ఠ చేసి అగ్నిగుండం నిర్వహంచారు. స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. సాయంత్రం భక్తుల సమక్షంలో వేద పండితులు స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే స్వామివారి కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం ఉత్సవ మూర్తులను విమానరథోత్సవంలో ఊరేగించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సురేశ్‌శెట్కార్, ఆలయ ఈవో శశిధర్, హనుమంత్‌రావు పాటిల్, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉమాకాంత్‌పాటిల్, వెంకటేశం, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ పాల్గొన్నారు.