కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని కామారెడ్డి అడిషనల్కలెక్టర్చంద్రమోహన్సూచించారు. మంగళవారం ఆఫీసర్లతో మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల షెడ్యూల్రిలీజ్అయిన తక్షణమే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తోందన్నారు. మోడల్కోడ్ఆఫ్కండక్ట్ అమలుచేసే ఫ్లయింగ్‌స్వ్కాడ్ లు, సర్వైవల్టీమ్, వీడియా టిమ్స్‌కు సంబంధించి ఆమోదం తెలిపారు. ఎవరు నిబంధనలు అతిక్రమించకుండా చూడాలన్నారు. అడిషనల్ఎస్పీ నరసింహరెడ్డి, సీపీవో రాజారాం, డీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.