కోతుల బెడద భారీ వృక్షాల చావుకొచ్చింది

  •     పంటలు పాడు చేస్తున్నాయని చెట్లకు నిప్పంటిస్తున్న  రైతులు 
  •     కొమ్మలు కాలి చనిపోతుండడంతో  నరికివేత


కామారెడ్డి, వెలుగు: జిల్లాలో కోతుల బెడద భారీ వృక్షాల చావుకొచ్చింది.  కామారెడ్డి,- ఎల్లారెడ్డి మధ్య హైవేకు ఇరువైపులాదశాబ్ధాల కింద  మర్రి చెట్లు నాటారు. అవి పెరిగి మహా వృక్షాలయ్యాయి. రోడ్డుపై వెళ్లే  ప్రయాణికులకు నీడనిస్తున్నాయి. తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్​ నుంచి  లింగంపేట, ఎల్లారెడ్డి వరకు ఈ  వృక్షాలు ఉన్నాయి. వీటిపై  ఆవాసం ఏర్పర్చుకున్న కోతుల గుంపులు ఇటీవల సమీప రైతుల పొలాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. కోతుల బాధ వేగలేక సదరు రైతులు వృక్షాల కొమ్మలకు నిప్పు పెడుతున్నారు. అవి క్రమంగా కాలుతూ చెట్లు చనిపోతున్నాయి. కాలిన మర్రి మానులను సంబంధిత శాఖల అధికారులు  కొట్టివేస్తున్నారు.