
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణికి145 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ విక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, రైతు భరోసా, పింఛన్లు, సదరం సర్టిఫికెట్లు, ఇండ్ల మంజూరు తదితర వాటిపై ఫిర్యాదులు వచ్చాయి. దరఖాస్తుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
నిజామాబాద్లో..
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి 64 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ దరఖాస్తులను స్వీకరించారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు అడిషనల్కలెక్టర్ సూచించారు.