
- కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టర్లు
కామారెడ్డిటౌన్, వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్లో పెట్టొద్దని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ కు 73 ఫిర్యాదులు రాగా, కలెక్టర్, ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ స్వీకరించారు. భూ సమస్యలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తులు వచ్చాయి.
నిజామాబాద్ కలెక్టరేట్లో..
నిజామాబాద్ సిటీ, వెలుగు : ప్రజావాణికి వచ్చి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లోని ప్రజావాణికి 70 ఫిర్యాదులు రాగా, కలెక్టర్, అడిషనల్కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీ.డీ రాజేందర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి స్వీకరించారు.