తెలంగాణ రైతు గ్రామీణ జీవితం పుస్తకావిష్కరణ

తెలంగాణ రైతు గ్రామీణ జీవితం పుస్తకావిష్కరణ

కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డికి చెందిన కవి, రచయిత కె. రామచంద్రం రచించిన ‘తెలంగాణ రైతు గ్రామీణ జీవితం’  పుస్తకాన్ని ఆదివారం అవిష్కరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీనియర్​సిటిజన్​ఫోరం బిల్డింగ్​లో ఆదివారం నిర్వహించిన పోగ్రాంలో ప్రముఖ కవి సూరారం శంకర్, టీఎస్​పీఎస్​సీ మాజీ మెంబర్ సుమిత్రానంద్​తదితరులు చీఫ్​గెస్టులుగా హాజరై పుస్తకాన్ని అవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి కష్టానికి విలువ కట్టలేమన్నారు. రైతు జీవన పరిస్థితిని రచయిత తన పుస్తకంలో చక్కగా వివరించారన్నారు. జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్​పున్న రాజేశ్వర్, తెలంగాణ రచయితల వేదిక జిల్లా ప్రెసిడెంట్​గఫూర్ శిక్షక్, అంబీర్​మనోహార్​రావు, ప్రతినిధులు విజయశ్రీ, నాగభూషణం, పీతాంబరం పాల్గొన్నారు.