కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో నేను బరిలో ఉన్నప్పటికీ మీరే క్యాండిడేట్లుగా భావించి కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని కామారెడ్డి అభ్యర్థి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం కామారెడ్డిలో కార్యకర్తల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తనను ఇక్కడి నుంచి పోటీ చేసి కేసీఆర్‌ను ఓడించాలని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సూచించారని చెప్పారు. కేసీఆర్‌ను ఎదుర్కోడానికి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.
మీరంతా ఒక్కక్కరు ఒక్కొక్క రేవంత్‌రెడ్డి అనుకొని గెలుపుకోసం పని చేయాలన్నారు. ఏ బూత్‌నుంచి మెజార్టీ తీసుకొస్తారో ఆ బూత్ ఇన్చార్జులతో కలిసి భోజనం చేస్తానని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్ దండుపాలెం బ్యాచ్ తిరుగుతోందని, వీరిని ఓడించాలన్నారు. కామారెడ్డి పోరాటాల గడ్డ అని, కేసీఆర్‌ను ఓడించేందుకు ఇక్కడి ప్రజలకు అవకాశం వచ్చిందన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీ తమ జేబుల్లోనే ఉన్నట్లు భావించి కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు.
ఎవరి గ్రామంలో వారే ప్రచారం చేయాలని సూచించారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని కోరారు. డీసీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌అలీ, పార్టీ లీడర్లు పండ్ల రాజు, చంద్రకాంత్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భీమ్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.