కామారెడ్డి, వెలుగు: సంప్రదాయ పంటలతో పాటు పండ్ల తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆఫీసర్లకు కామారెడ్డి కలెక్టర్ఆశిశ్సంగ్వాన్ సూచించారు. గురువారం మాచారెడ్డి మండలంలోని సోమార్పేట, కొత్తపల్లి, లక్ష్మీరావులపల్లి, మాచారెడ్డి గ్రామాల్లో పర్యటించారు. మహిళా సంఘాల ద్వారా లోన్లు తీసుకొని చేపట్టిన డ్రాగన్ ఫ్రూట్స్, పండ్ల తోటలు, కూరగాయాల సాగును, నిర్వహిస్తున్న డెయిరీని కలెక్టర్ పరిశీలించారు.
లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకున్న లోన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదాయం పెంచుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్‌రావు, డీఆర్డీవో సురేందర్, డీపీవో శ్రీనివాస్‌రావు, డీపీఎం రమేశ్, సివిల్సప్లయ్డీఎం రాజేందర్, తహసీల్దార్శ్వేత తదితరులు పాల్గొన్నారు.