ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • ​​​​​కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 కామారెడ్డిటౌన్, వెలుగు:  ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అన్నారు. బుధవారం సాయంత్రం   కలెక్టరేట్‌లో  ఉపాధి హామీ పనులు,  నర్సరీలు, ఇంటి పన్నుల వసూళ్లు, తాగునీటి సప్లయ్​అంశాలపై అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. కలెక్టర్​ మాట్లాడుతూ..  జాబ్​కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నారు. 

గ్రామాల్లో ఆస్తి పన్ను వచ్చే నెల15లోగా 100 శాతం వసూలు చేయాలన్నారు.  ఎండాకాలంలో గ్రామాలు, టౌన్‌లలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అడిషనల్​ కలెక్టర్లు విక్టర్​, శ్రీనివాస్​రెడ్డి, సబ్​ కలెక్టర్​ కిరణ్మయి, ఆర్డీవోలు రంగనాథ్​రావు,  ప్రభాకర్​, అధికారులు చందర్, రాజారాం, సురేంధర్​, దయానంద్​ పాల్గొన్నారు.