కామారెడ్డి లో ఎల్ఆర్​ఎస్​ సర్వే పక్కగా నిర్వహించాలి : కలెక్టర్​ ఆశిశ్ ​సంగ్వాన్​

కామారెడ్డి లో ఎల్ఆర్​ఎస్​ సర్వే పక్కగా నిర్వహించాలి : కలెక్టర్​ ఆశిశ్ ​సంగ్వాన్​

 

కామారెడ్డి టౌన్, వెలుగు:  ఎల్ఆర్ఎస్​సర్వే పక్కగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్​ఆశిశ్ ​సంగ్వాన్​ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్​లో ఎల్ఆర్ఎస్​ పక్రియను పరిశీలించారు.  రూల్స్​ ప్రకారం సర్వే చేయాలన్నారు.  రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్​ ఆఫీసర్లు దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఏ రోజు రిపోర్ట్​ ఆ రోజు ఆప్​డేట్​చేయాలన్నారు.   ఆర్డీవో రంగనాథ్​రావు,  మున్సిపల్​ కమిషనర్​ సుజాత, తహసీల్దార్​జనార్ధన్, ఆయా శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.

స్టూడెంట్స్​కు మెరుగైన బోధన అందించాలి

స్టూడెంట్స్​కు మెరుగైన బోధన అందించాలని కలెక్టర్ లెక్చరర్లకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి గవర్నమెంట్​డిగ్రీ కాలేజీని సందర్శించి  రాశివనంలో మొక్క నాటారు.  కాలేజీలోని ల్యాబ్స్, ఆయా విభాగాలను పరిశీలించారు.  స్టూడెంట్స్​హాజరు, బోధన తదితర అంశాలపై ప్రిన్సిపాల్​ విజయ్​కుమార్, లెక్చరర్లను అడిగి తెలుసుకున్నారు.  కాలేజీకి సంబంధించిన అంశాలపై చర్చించారు.  ఆయన వెంట ఆర్డీవో రంగనాథ్​రావు తదితరులు ఉన్నారు. 

గడువులోగా రిపోర్ట్స్​ సమర్పించాలి

  ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై తహసీల్దార్లు వెంటనే స్పందించి, నిర్ణీత గడువులోగా పూర్తయిన పనుల నివేదికలు సమర్పించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్​సంగ్వాన్​ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, నాయబ్​ తహసీల్దార్లు, సర్వేల్యాండ్ రికార్డ్స్​ఆఫీసర్లు, సర్వేయర్లు,  కలెక్టరేట్లోని ఆయా విభాగాల సెక్షన్​ ఇన్​చార్జిలతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి, ప్రజావాణి తదితర అంశాలపై చర్చించారు.  ధరణి అంశాలపై రోజుకు రెండు మండలాల చొప్పున 
రివ్యూ చేస్తామన్నారు.