పర్మిషన్​ లేని హాస్పిటల్స్​పై చర్యలు తీసుకోవాలి

పర్మిషన్​ లేని హాస్పిటల్స్​పై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి టౌన్, వెలుగు: హాస్పిటల్స్​ను తనిఖీ చేసి రిజిస్ర్టేషన్​ కోసం  సిఫారసు​ చేయాలని కామారెడ్డి కలెక్టర్​ఆశిశ్ ​సంగ్వాన్​ ఆఫీసర్లను ఆదేశించారు.   మంగళవారం కలెక్టరేట్లో  జిల్లా రిజిస్ర్టేషన్స్​అథారిటీ  మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జిల్లాలో పర్మిషన్​ లేని హాస్పిటల్స్​పై చర్యలు తీసుకోవాలన్నారు.  తనిఖీ చేసి రిజిస్టర్​​కానీ హాస్పిటల్స్​కు నోటీసులిచ్చి ఫైన్​ విధించాలన్నారు. 

 రిజిస్టర్​ అయిన హాస్పిటల్స్​లో డాక్టర్​ మారితే వెంటనే డీఎంహెచ్​వోకు సమాచారం ఇవ్వాలన్నారు.  గుర్తింపు పొందిన హాస్పిటల్స్​లో డాక్టర్ల పేర్లు,  రేట్ల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.    జిల్లాలో 127 రిజిస్టర్డ్​ హాస్పిటల్స్​ఉన్నాయని తెలిపారు.   ఎస్పీ సింధూశర్మ,  అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి,  డీఎంహెచ్​వో డాక్టర్​ చంద్రశేఖర్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్​ రమణ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

నేషనల్​ హైవేలపై ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్​ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రోడ్​ సేఫ్టీ కమిటీ మీటింగ్​ జరిగింది. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ..  హైవేలపై ఉన్న టెకిర్యాల్, పొందుర్తి,  భిక్కనూరు జంక్షన్ల వద్ద  ప్రమాదాల నివారణకు సూచికల బోర్డులు,   లైటింగ్​  ఏర్పాటు చేయాలన్నారు.   మండల స్థాయిలో రోడ్డు భద్రతపై స్టూడెంట్స్​తో అవగాహన పోగ్రాములు నిర్వహించాలన్నారు.  

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల ఆఫీసర్లు  సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు.  గుర్తించిన స్టాప్​లోనే ఆర్టీసీ బస్సులు నిలిపే విధంగా చూడాలని డీఎంను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి,  ఆర్టీవో శ్రీనివాస్​రెడ్డి, ఈఈ రఘుశంకర్, వివిధ శాఖల ఆఫీసర్లు 
పాల్గొన్నారు.