కామారెడ్డి టౌన్, వెలుగు: సమగ్ర ఇంటింటి సర్వేను పక్కగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సర్వేపై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే చేపట్టాలన్నారు. ఇందు కోసం ఎన్యూమరేటర్లను నియమించి శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ప్రశ్నావళికి సంబంధించిన వివరాలను ఇంటింటికి వెళ్లి సేకరించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సీపీవో రాజరాం, డీపీవో శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
స్పెషల్ సమ్మరీ రివిజన్ముసాయిదా ప్రకటన
స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ముసాయిదా ఓటర్ లిస్టును ప్రకటించినట్లు కలెక్టర్‌తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయా పార్టీల ప్రతినిధులతో ఓటర్ లిస్టు సవరణపై మీటింగ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముసాయిదా ఓటర్ లిస్టుపై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే నవంబర్ 28లోగా తెలియజేయాలన్నారు. ఓటర్ లిస్టు కోసం నవంబర్9,10 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 2025 జనవరి 6న ఫైనల్లిస్ట్ను రిలీజ్చేస్తామని తెలిపారు. 2025 జనవరి 1 నాటికి18 ఏండ్లు నిండిన వారు ఓటర్‌గా నమోదు చేసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్‌రావు, తహసీల్దార్జనార్ధన్ తదితరులు
పాల్గొన్నారు.