
కామారెడ్డి, వెలుగు : రోడ్డు సేప్టీ రూల్స్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో రోడ్డు సేఫ్టీ కమిటీ మీటింగ్ జరిగింది. గత 3 నెలలుగా జరిగిన రోడ్డు యాక్సిడెంట్లు, వీటికి గల కారణాలపై రివ్యూ చేశారు. చిన్న పాటి జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో 28 బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన ప్రణాళిక రూపొందించామన్నారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి, ఆర్టీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హన్మంత్ రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.