12 రెవెన్యూ గ్రామాల్లో 1416 దరఖాస్తులు : ఆశిష్ సంగ్వాన్​

 12 రెవెన్యూ గ్రామాల్లో  1416 దరఖాస్తులు :  ఆశిష్ సంగ్వాన్​
  • కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

 లింగంపేట, వెలుగు : ‘భూభారతి’ దరఖాస్తులు కేటగిరిల వారీగా పొందుపర్చాలని, గురువారం వరకు  12 రెవెన్యూ గ్రామాల్లో1416 దరఖాస్తులు వచ్చాయని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్  అన్నారు. శుక్రవారం లింగంపేట తహసీల్దార్ ఆఫీస్​లో దర ఖాస్తులు పొందుపరిచే తీరుపై కలెక్టర్​సూచనలు చేశారు. లింగంపేట మండలంలో 23 రెవెన్యూ గ్రామాల్లో  భూ సమస్యలపై అప్లికేషన్లు స్వీకరిస్తున్నామన్నారు. 

 ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సదస్సుల అనంతరం  ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్య క్ర మంలో బాన్సువాడ సబ్​కలెక్టర్ కిరణ్మయి, భూభారతి లింగంపేట మండల ప్రత్యేకాధికారి, డిప్యూటీ కలెక్టర్ రాజేందర్, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేష్​, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం లింగంపేట రైతు వేదికలో నిర్వహించిన రైతుసదస్సులో కలెక్టర్​ రైతులకు అవగాహన కల్పించారు.

బిచ్కుంద, జుక్కల్​గ్రామాల్లో... 

పిట్లం, వెలుగు :  బిచ్కుంద, జుక్కల్ గ్రామాల్లోని 'భూభారతి' అవగాహన సదస్సులో కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పాల్గొని మాట్లాడారు.  రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, భూ సర్వే, పెండింగ్ సాదాబైనామాల వంటి సమస్యలపై భూభారతిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్​ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేసి పాసు పుస్తకంలో భూమి పటం నమోదు చేస్తారని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న దృష్ట్యా రైతులు ఫాంపౌండ్​లను నిర్మించుకోవాలన్నారు.  తొలుత భూభారతి చట్టంపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు.  కార్యక్రమంలో  జుక్కల్​, బిచ్కుంద మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రెవెన్యూ సిబ్బందిపాల్గొన్నారు.