సాగుకు పనికిరాని భూములను గుర్తించాలి : కలెక్టర్​ఆశిష్​సాంగ్వాన్​ 

సదాశివనగర్, వెలుగు : జిల్లాలో సాగుకు యోగ్యంగా లేని భూములను త్వరగా గుర్తించి నివేదికలు సమర్పించాలని అధికారులను కామారెడ్డి కలెక్టర్​ఆశిశ్​సాంగ్వాన్​ఆదేశించారు. శుక్రవారం సదాశివనగర్​ తహసీల్దార్​కార్యాలయంలో మండల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్​ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలపై  అధికారులకు వివరించారు.

గ్రామాల్లో అధికారులు వంద శాతం సర్వే చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో సర్వే నంబర్​ 955 లో 19 గుంటల భూమిని పరిశీలించారు. ప్రజాపాలనలో రేషన్​కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్న కుటుంబాలపై చేస్తున్న సర్వే తీరును పరిశీలించారు. ఆ తర్వాత ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. కలెక్టర్​ వెంట జిల్లా వ్యవసాయ అధికారి తిరుమ ప్రసాద్, జడ్పీ సీఈవో చందర్​నాయక్, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా పౌర సరఫరా అధికారి మల్లికార్జున్​బాబు, తహసీల్దార్​గంగాసాగర్, ఎంపీడీవో సంతోశ్​ కుమార్, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, ఎంపీవో సురేందర్​రెడ్డి, డాక్టర్​ఆస్మా తదితరులు పాల్గొన్నారు.