కామారెడ్డిటౌన్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సోమవారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సందర్శించి రిసెప్షన్ సెంటర్, మెటీరియల్డిస్ర్టిబ్యూషన్ సెంటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం గదుల్లో సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అడిషనల్కలెక్టర్విక్టర్, ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ జనార్దన్ ఉన్నారు.
కోడ్ఖచ్చితంగా పాటించాలి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడ్ఖచ్చితంగా పాటించాలని ఆయా పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ఆశిష్ సంగ్వాన్సూచించారు. కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల కోడ్అమలులో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ భవనాలను వినియోగించరాదన్నారు. ఓటర్లను ప్రభావితం చేయరాదనిచెప్పారు.