కామారెడ్డి టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్వి పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణకు 10 రోజుల ముందు వరకు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చన్నారు.
ఫైనల్ ఓటరు లిస్టులో ఏవరికైనా ఓటు లేకపోతే బూత్ లెవెల్ఎలక్టోరల్ ఏజెంట్, రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫిర్యాదుల కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం ఈవీఎం గోడౌన్ను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.