- కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
కామారెడ్డి, వెలుగు : ఎఫ్‌సీఐకి కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను ఈ నెలాఖరులోగా కంప్లీట్ చేయాలని రైస్‌మిల్లర్లకు కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో మిల్లర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
సీఎంఆర్ టార్గెట్‌ను కంప్లీట్ చేయని మిల్లులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమే కాకుండా, చర్యలు తీసుకుంటామన్నారు. పోటీతత్వంతో మిల్లర్లు సీఎంఆర్ కంప్లీట్చేయాలన్నారు. డీఎస్వో మల్లికార్జున్‌బాబు, సివిల్సప్లయ్డీఎం అభిషేక్‌సింగ్, ఆఫీసర్లు, రైస్‌మిల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.