పొలాల్లో ఫాంపాడ్స్ నిర్మించుకోవాలి : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

పొలాల్లో ఫాంపాడ్స్ నిర్మించుకోవాలి : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

కామారెడ్డిటౌన్, వెలుగు : రైతులు పంట పొలాల్లో ఫాంపాడ్స్​ నిర్మించుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​ పేర్కొన్నారు.  శనివారం కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో  ఉపాధి హామీ పథకం కింద  నిర్మిస్తున్న ఫాంపాడ్స్​ను ఆయన పరిశీలించారు.  

ఆయన మాట్లాడుతూ.. ఫాంపాడ్స్​ నిర్మించుకోవటం ద్వారా  చేపల పెంపకం కూడా చేపట్టవచ్చన్నారు.  తద్వారా రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు.  ఎంపీవో మలహరి తదితరులున్నారు.