- కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్
కామారెడ్డి టౌన్, వెలుగు : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్‌వి పాటిల్సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి పార్లమెంట్ఎన్నికల నిర్వహణపై ఆర్డీవోలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో కలెక్టర్, ఎస్పీ సింధూశర్మ జూమ్మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలింగ్‌కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. సీ–విజిల్ద్వారా వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ చెక్‌పోస్టుల వద్ద అధికారులు వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
టెన్త్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలి..
టెన్త్ఎగ్జామ్స్ను పకడ్బందీగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్‌వి పాటిల్ అధికారులను ఆదేశించారు. టెన్త్ఎగ్జామ్స్నిర్వహణపై సీఎస్ శాంతికుమారి, ఎడ్యుకేషన్ కమిషనర్దేవసేన టెలీకాన్ఫరెన్స్ద్వారా మాట్లాడారు. ఎగ్జామ్ సెంటర్లను ప్రతిరోజూ తనిఖీ చేయాలని, పరీక్షలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్సూచించారు.
వరి ధాన్యాన్ని అప్పగించాలి
గత యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు వెంటనే బిడ్డర్లకు అప్పగించాలని కలెక్టర్జితేష్ వి.పాటిల్ఆదేశించారు. కలెక్టరేట్ లో రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2022–-23 యాసంగిలో లక్షా 61 వేల మెట్రిక్‌టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం వేలం వేసి బిల్డర్లకు కేటాయించిందన్నారు. రైస్‌మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే బిల్డర్లకు సరఫరా చేయాలన్నారు.
2023–-24 వానాకాలానికి సంబంధించిన 4 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మరాడించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. డీఎస్వో మల్లికార్జునబాబు, డీఎం నిత్యానందం, రైస్‌మిల్లర్ల సంఘం ప్రెసిడెంట్ లింగం పాల్గొన్నారు.
విద్యార్థులకు బహుమతులు అందజేత
లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఇటీవల సైబర్ క్రైమ్, మనీ మెనేజ్మెంట్అంశాలపై విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలు నిలిచిన విద్యార్థులకు మంగళవారం కామారెడ్డి కలెక్టర్ జితేష్‌వి పాటిల్బహుతులు అందజేశారు. కార్యక్రమంలో లీడ్బ్యాంకుమేనేజర్సుధీర్ భార్గవ్తదితరులు పాల్గొన్నారు.