ఎల్ఆర్ఎస్​రాయితీపై ప్రచారం చేయాలి : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

ఎల్ఆర్ఎస్​రాయితీపై ప్రచారం చేయాలి : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : అనధికార  ఫ్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 25 శాతం రాయితీ అవకాశం కల్పించినట్లు విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపాలిటీలోని ఎల్ఆర్ఎస్ హెల్ప్​డెస్క్​ను కలెక్టర్​ పరిశీలించి మాట్లాడారు.  ఎల్ఆర్ఎస్​ దరఖాస్తుదారులకు ఫోన్​ చేసి సమాచారమివ్వాలన్నారు. పట్టణంలో పారిశుధ్యం లోపించవద్దని, రోడ్ల వెంట మొక్కలకు నీళ్లు పట్టాలన్నారు.

 ఫార్కుల్లో చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలో అనుమతి లేని హోర్డింగ్​లను  తొలగించాలన్నారు. వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలన్నారు. కలెక్టర్​ వెంట అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్​రెడ్డి,  డీఈ వేణుగోపాల్,  ఏఈ శంకర్,  టీపీవో గిరిధర్ తదితరులు ఉన్నారు.