
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సంఘ్వన్ తనిఖీ చేశారు. ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. శుక్రవారం ( సెప్టెంబర్ 20) రాత్రి హాస్టల్ లో విద్యార్థులతో కలిసి పడుకున్నారు. గురుకుల పాఠశాల నిర్వహణ, ఆహార నాణ్యత మొదలగు విషయాల గురించి ఆరా తీశారు.