- కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా మెనేజ్మెంట్కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో రెడ్‌క్రాస్‌సొసైటీ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
రెడ్‌క్రాస్ సోసైటీలో సభ్యులను ఎక్కువ సంఖ్యలో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఎం.రాజన్న, సీపీవో రాజారాం, ఐసీడీఎస్ పీడీ బావయ్య, ప్రతినిధులు రఘుకుమార్, నర్సింహం, సంజీవరెడ్డి, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.