
కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో కొత్తగా మరో 10 సోసైటీల ఏర్పాటుకు కమిటీ నిర్ణయించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన సహాకార సంఘాల కమిటీ మీటింగ్‌లో కలెక్టర్ మాట్లాడారు. రైతులకు మరింతగా సేవలు అందించేందుకు సోసైటీలను పునర్ వ్యవస్థీకరణ చేయాలని కమిటీ నిర్ణయించిందన్నారు. కమిటీ ప్రపోజల్స్ ను స్టేట్ కమిటీకి పంపుతున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, చందర్‌నాయక్, డీసీవో రాంమోహన్, డీఆర్డీవో సురేందర్, ఫీషరీష్ అధికారి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.
పోషణ పక్షం పోస్టర్ల అవిష్కరణ
పోషణ పక్ష పోస్టర్లను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అవిష్కరించారు. ఈ నెల 22 వరకు పక్షోత్సవాలు జరగనున్నాయి. రోజు వారీ షెడ్యూల్ ప్రకారం పోగ్రాంలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అడిషనల్ కలెక్టర్ చందర్‌నాయక్, జిల్లా వెల్పేర్ ఆఫీసర్ ప్రమీల, సీడీపీవోలు శ్రీలత, కళావతి పాల్గొన్నారు.