పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి : ఫైర్ ఆఫీసర్​ సుధాకర్​

పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి : ఫైర్ ఆఫీసర్​ సుధాకర్​

కామారెడ్డి టౌన్, వెలుగు : దీపావళి  పండగ సందర్భంగా ప్రజలు పటాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి  జిల్లా ఫైర్ ఆఫీసర్​సుధాకర్​ పేర్కొన్నారు.  బుధవారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. పటాకులను ఇండ్ల మధ్యన  కాకుండా ఖాళీ ప్రదేశాల్లోనే కాల్చాలన్నారు.  చిన్న పిల్లలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.  

పటాకులు కాల్చే సమీపంలో బకెట్లో నీటిని అందుబాటులో ఉంచుకోవాలని,   కాటన్​ దుస్తులు ధరించాలని,  పిల్లలు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గరగా ఉండాలని సూచించారు. మండే స్వభావం ఉన్న వస్తువుల దగ్గర పటాకులు కాల్చొద్దన్నారు.  టపాసులు కాల్చేటప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులను వెంటనే హాస్పిటల్​కు తీసుకెళ్లాలన్నారు.