కామారెడ్డి జిల్లాలో 237 ఎంపీటీసీ స్థానాలకు ఆమోదం

కామారెడ్డి జిల్లాలో 237 ఎంపీటీసీ స్థానాలకు ఆమోదం
  • జిల్లాలో పెరిగిన 1 ఎంపీటీసీ స్థానం
  • డ్రాప్ట్ పబ్లికేషన్​పై 19 అభ్యంతరాలు

 కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో 237 ఎంపీటీసీ స్థానాలకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు 236 ఎంపీటీసీ స్థానాలు ఉండగా బీబీపేట మండలంలో 1 స్థానం అదనంగా పెరిగింది. దీంతో వీటి సంఖ్య 237 కు చేరింది.  కొన్ని మండలాల్లో ఎంపీటీసీ స్థానాల పరిధిలోని గ్రామాల మార్పుతో పాటు, కొత్త ఎంపీటీసీ స్థానం ఏర్పాటుపై  జనవరి 30న జడ్పీ అధికారులు  డ్రాప్ట్ పబ్లికేషన్​ రిలీజ్​చేశారు.

  దీనిపై అభ్యంతరాలు స్వీకరిచంగా 19 అభ్యంతరాలు వచ్చాయి.  సోమవారం కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​ అభ్యంతరాలను కలెక్టరేట్​లో పరిశీలించారు. మద్నూర్, పెద్దకొడప్​గల్, పాల్వంచ  మండలాల్లో ఎంపీటీసీ స్థానాల పరిధిలోని గ్రామాల మార్పుపై అభ్యంతరాలు వచ్చాయి.  పాల్వంచ మండలంలోని భవానిపేట తండా ఆరేపల్లి స్థానంలో ఉండగా దీన్ని భవానీపేటలో  ప్రతిపాదించగా అభ్యంతరం వచ్చింది. యధావిధిగా ఆరేపల్లిలో కొనసాగించాలని విన్నవించారు.  దీనికి అంగీకారం తెలిపారు. 237 స్థానాలకు కలెక్టర్​ఆమోద ముద్ర వేశారు. జడ్పీ సీఈవో చందర్, తదితరులు పాల్గొన్నారు.