కామారెడ్డి జిల్లాలో ఏడాది కాలంలో రూ.10 కోట్ల ఫైన్లు

ట్రాఫిక్ రూల్స్‌‌‌‌ పాటించని వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. రోడ్లపై ప్రతి రోజు వెహికల్స్ తనిఖీలు చేస్తూ భారీగా జరిమానాలు వేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది రూ.10 కోట్ల మేర ఫైన్లు వేశారు. నిరుటి కంటే ఈసారి ఈ–చలాన్​  కేసులు భారీగా పెరిగాయి. అయితే జిల్లా కేంద్రంలో ట్రాఫిక్​ నియంత్రణను గాలికి వదిలేసిన పోలీసు శాఖ ఫైన్లు వేయడానికే పరిమితమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో నేషనల్ హైవేలతో పాటు స్టేట్ హైవేలు, జిల్లా రోడ్లు కలిసి 1,492 కిలో మీటర్ల మేర ఉన్నాయి. ఈ రోడ్ల మీద ప్రతి రోజు వేలాది సంఖ్యలో వెహికల్స్ రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాలో యాక్సిడెంట్ల సంఖ్య ఎక్కువే.. రూల్స్ పాటించకపోవడంతోనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయనే కోణంలో పోలీసు శాఖ ఎక్కువగా ఫైన్లు వేస్తోంది. పోలీసు స్టేషన్ల స్థాయిని బట్టి రోజు వారీ ఈ–చలాన్ల కేసుల టార్గెట్ ఇచ్చారు. ఒక్కో స్టేషన్‌‌‌‌కు రోజు 20 నుంచి 100 వరకు ఈ–చలాన్​ కేసుల టార్గెట్​ఉంది. జిల్లా కేంద్రంతో పాటు సమీప పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కువ ఈ–చలాన్లు వేస్తున్నారు. చౌరస్తాల్లో ట్రాఫిక్ జామ్‌‌‌‌ అయినా కూడా సమీపంలో ఉండే పోలీసులు దానిని కంట్రోల్​ చేయడం కంటే ఫైన్లు విధించడానికే ప్రయార్టీ ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కేసుల పరిస్థితి ఇది..

ఈ ఏడాది పోలీసులు రోడ్లపై వెహికల్స్​తనిఖీ చేస్తున్నప్పుడు రూల్స్ పాటించని వారికి విధించిన దాంట్లో 1,14,612 కాంటాక్ట్ కేసు లు, 2,69,518 నాన్ కాంటాక్ట్ ( కెమెరాల ద్వారా ఫొటోలు తీసిన) కేసులు, స్పీడ్​గన్ 92,037,  డ్రంక్ అండ్ డ్రైవ్‌‌‌‌లో 5,562 ఈ– చలాన్లు విధించారు. ఈ కేసులకు సంబంధించి రూ.10 కోట్ల వరకుఫైన్లు వేసినట్లు పోలీసు ఆఫీసర్లు తెలిపారు. హెల్మెట్​లేకుండా బైక్​ నడిపించడం, త్రిబుల్ రైడింగ్, సీట్​బెల్ట్ లేకుండా ఫోర్ వీలర్​ డ్రైవింగ్, నోపార్కింగ్‌‌‌‌లో అపారని, ఓవర్​ స్పీడ్, మైనర్​ డ్రైవింగ్‌‌‌‌లు, డ్రైవింగ్​లైసెన్సు, వెహికిల్ పేపర్లు లేకపోవడం వంటి కేసుల్లో కూడా ఫైన్లు వేస్తున్నారు. ఈ– చలాన్‌‌‌‌లో రూ. 135 నుంచి రూ.1,035 వరకు వివిధ రకాలుగా ఫైన్లు వేస్తారు. 

జిల్లాలో ఏడు స్పీడ్ గన్లు

జిల్లాలో 7 స్పీడు గన్లను ( లేసర్​ గన్లు) ఏర్పాటు చేశారు.  ఓవర్​ స్పీడ్‌‌‌‌గా వెళ్లే ఫోర్ వీలర్ వెహి కల్స్‌‌‌‌ను  గుర్తించి ఫైన్​ వేస్తున్నారు. హైవే 44, హైవే 161, 765(డి)తో పాటు స్టేట్ హైవే 11,  జిల్లా రోడ్లపై స్పీడ్ గన్‌‌‌‌లతో రహస్యంగా  వెహికల్​స్పీడ్ రికార్డు చేస్తున్నారు.  ఆ ఏరియాలో నిర్ధేశించిన స్పీడ్​ కంటే ఎక్కువ స్పీడ్‌‌‌‌గా వెళ్లే వారికి  రూ.1,035 పైన్ వేస్తున్నారు. 

స్పీడ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ చేసేందుకే...

నేషనల్‌‌‌‌ హైవేలు, స్టేట్ హైవేలు, ఇతర రోడ్లపై వెహికల్స్ స్పీడ్ కంట్రోల్ చేసేందుకు స్పీడ్ గన్స్​ ఏర్పాటు చేశాం.  నిర్ధేశించిన స్పీడ్ కంటే  ఎక్కువ స్పీడ్‌‌‌‌గా వెళ్తే ఫైన్ వేస్తున్నాం. హెల్మెట్‌‌​ లేని వారికి , రూల్స్​పాటించని వారికి కూడా ఫైన్లు వేస్తున్నాం. ఫైన్లకు భయపడైనా రూల్స్ పాటిస్తారని మా భావన. -  బి.శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ఎస్పీ కామారెడ్డి