కామారెడ్డి జిల్లా చలి గజ గజ

కామారెడ్డి జిల్లా చలి గజ గజ
  • జుక్కల్ లో అత్యల్పంగా 7.6 డిగ్రీల నమోదు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా గజ గజ వణుకుతోంది.  జిల్లాలో  రోజురోజుకు  ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.  ఆదివారం ఉదయం కనిష్ణ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యాయి.  రాత్రి నుంచి చలి తీవ్రత బాగా పెరిగింది.  జుక్కల్‌‌ లో అత్యల్పంగా 7.6  డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.  మెనూరు లో 8.9 డిగ్రీలు, బిచ్కుంద, బీర్కూర్‌‌‌‌లో 9.2 డిగ్రీలు, బొమ్మ దేవునిపల్లి 9.5, నస్రుల్లాబాదులో 9.6, వేల్పుగొండ, గాంధారిలో 9.7, పిట్లం లో 9.8, పుల్కల్, సర్వాపూర్ లో, దోమకొండ, నాగిరెడ్డిపేటలో 10 డిగ్రీలు, లింగంపేట, రామారెడ్డి, లచ్చ పేటలో10.2, కొల్లూరు, మాచాపూరులో 10.4, ఇసాయిపేట 10.5, పాత రాజంపేట 10.9, బీబీపేట 11.3, రామ్ లక్ష్మణ్ పల్లి, అసన్ పల్లి, పెద్ద కొడపుగల్ లో11.4, ఆర్గొండ 12.2, బిక్కనూరులో 12.6, కామారెడ్డిలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.

నిజామాబాద్@10 డిగ్రీలు 

నిజామాబాద్​, వెలుగు:నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు చూడనంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదయ్యాయి. జిల్లాలో మంచు కురుస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. జిల్లాలో అత్యల్పంగా గూపన్ పల్లిలో 8.3, పోతంగల్, మెండోరాలో 8.7, పాల్దాలో 9.3, నస్రుల్లాబాద్, మాక్లూర్ లో 9.5, సిరికొండ, నందిపేట్ లో 9.6, నిజామాబాద్ సౌత్, పెర్కిట్, ఎడపల్లి, గాంధారిలో 9.7, మంచిప్ప, ఆర్మూర్, మోర్తాడ్, బాల్కొండ10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్నిలోని జాకోరా, కామారెడ్డిలోని ఐడీవోసీ మినహా మిగతా ప్రాంతాల్లో 10,-12 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.