- పెట్రోల్ పోసుకున్న మహిళలు
- రైతు పరిస్థితి విషమం
- కామారెడ్డి జిల్లా కొండాపూర్శివారులో ఘటన
లింగంపేట, వెలుగు : ఫారెస్ట్రేంజ్ఆఫీసర్, సిబ్బంది వేధింపులు భరించలేక ఓ రైతు విషం తాగగా, ఇద్దరు మహిళలు పెట్రోల్‌పోసుకుని సూసైడ్ అటెంప్ట్చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొండాపూర్శివారులో జరిగింది. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం మండలంలోని ముంబాజీపేటకు చెందిన గుర్రపు కళవ్వకు కొండాపూర్శివారులో సర్వే నెంబర్ 99/48లో 2ఎకరాల20 గుంటల భూమి ఉంది. దీనికి రెవెన్యూ ఆఫీసర్లు పట్టా పాస్బుక్మంజూరు చేశారు. కళవ్వ తన కొడుకులు సాయిబాబా, విజయ్, సంతోష్‌లతో కలిసి 50 ఏండ్లుగా ఈ భూమిలో సాగు చేసుకుంటోంది.
ఇటీవల ఎల్లారెడ్డి ఫారెస్ట్రేంజ్ఆఫీసర్ఓంకార్, డిప్యూటీ రేంజ్ఆఫీసర్పృథ్వీ, బీట్ఆఫీసర్ ఫిరోజ్‌ఖాన్ వెళ్లి అది ఫారెస్ట్భూమి అని, ప్లాంటేషన్ చేస్తామని, పంటలు వేయవద్దని హెచ్చరించారు. బాధితులు పాస్‌బుక్‌లు చూపించినా వినలేదు. దీంతో సర్వే కోసం చలాన్కట్టారు. సోమవారం ల్యాండ్సర్వే జిల్లా ఇన్స్పెక్టర్అంబర్సింగ్ఫారెస్ట్ఆఫీసర్ల సమక్షంలో సర్వే చే పట్టేందుకు వచ్చారు. సర్వే నంబర్లో మొత్తంగా 381.17 ఎకరాల భూమి ఉండగా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు 216 ఎకరాలు, రెవెన్యూ శాఖకు 165 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. అయితే, భూములకు సంబంధించిన రికార్డులు సరిగ్గా లేవని, వారం రోజుల్లో మరోసారి వచ్చి పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దులు చూపిస్తామని చెప్పి వెళ్లిపోయారు.
అయినా, ఫారెస్ట్ ఆఫీసర్లు కళవ్వకు చెందిన పట్టా భూమిలో మొక్కలు నాటేందుకు గుంతలు తీయించడంతో పాటు కుటుంబసభ్యులను భూమి వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన కళవ్వ కోడళ్లు భాగ్యలక్ష్మి, కావేరి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. కళవ్వ రెండో కొడుకు గుర్రం విజయ్(34) ఫారెస్ట్ఆఫీసర్లు, గ్రామస్తుల ముందే విషం తాగాడు. అతడిని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, దీనిపై ఎల్లారెడ్డి ఫారెస్ట్రేంజ్ఆఫీసర్ ఓంకార్‌ను వివరణ కోరగా తమను భయపెట్టడానికే విజయ్విషం తాగాడని చెప్పారు.