ఉక్రెయిన్ లో కామారెడ్డి జిల్లా విద్యార్థులు..తల్లిదండ్రుల ఆందోళన

ఉక్రెయిన్ పై రష్యాదాడితో  వేలాదిమంది భారతీయ విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. ఎటు పోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వారిని తీసుకొచ్చేందుకు శథవిధాల ప్రయత్నాలు చేస్తుంది.  ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఉక్రెయిన్  రొమేనియా బార్డర్ కు  చేరుకుంటున్నారు. వీరి కోసం ఒక ఎయిరిండియా విమానం ముంబై నుంచి బుకారెస్ట్ వెళ్లింది.  కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు వైద్య విద్యార్థులు ఉక్రెయిన్ లో ఉండిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారి పిల్లలను క్షేమంగా రప్పించాలని కోరుతున్నారు.

కామారెడ్డిలోని బృందావన్ కాలనీకి చెందిన పెండ్యాల అన్వేష్ అపోరిజ్జి స్టేట్ లోని అపోరిజ్జియా యూనివర్సిటీ లో ఎంబీబీఎస్ ఐదో సంవత్సరం చదువుతున్నాడు. కామారెడ్డిలోని ఎన్జీవోఎస్ కాలనీకి చెందిన మామిడాల విష్ణు కౌండిన్యా జపారిజ్జియా మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పోర్త్ ఇయర్ చదువుతున్నాడు. బిబిపేట్ మండలానికి చెందిన బచ్చు హరిప్రియ వర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతుంది.

రష్యా సైనికులను నిలదీసిన మహిళ

 

రష్యా దాడికి వ్యతిరేకంగా UN భద్రతా మండలిలో ఓటింగ్