- కామారెడ్డి జిల్లాలో పోలీసు శాఖ సరికొత్త కార్యక్రమం
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టింది. నేరాల నియంత్రణలో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కాలేజీ స్టూడెంట్స్‌తో ఆరు సేప్టీ క్లబ్‌లు ఏర్పాటు చేసింది. ఇందుకోసం 1000 మంది కాలేజీ స్టూడెంట్స్ పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్లుగా సెలక్ట్ చేశారు. సేప్టీ క్లబ్‌ల ప్రారంభ కార్యక్రమం శనివారం జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సింధూశర్మ హాజరయ్యారు.
చదువుకునే వయస్సునుంచే మంచి నడవడికతో ముందుకెళ్లాలని, క్లబ్ మెంబర్లుగా ఎన్నికైన స్టూడెంట్స్అదృష్టవంతులుగా భావించి బాధ్యతాయుతంగా మెలగాలని కలెక్టర్ అన్నారు. ఈ వయసు నుంచే సమాజానికి ఏదైనా మంచి చేయాలనే అలోచన కలిగి ఉండాలనే కాలేజీ స్టూడెంట్స్‌ను సేఫ్టీ అంబాసిడర్లుగా నియమించామని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐలు చంద్రశేఖర్‌రెడ్డి, రామన్, గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
సేప్టీ క్లబ్‌లు ఇవే
మొత్తం 21 కాలేజీల్లో ఈ క్లబ్‌లు ఏర్పాటు చేశారు. అవి1)సైబర్ సేప్టీ క్లబ్, 2) రోడ్ సేప్టీ క్లబ్, 3) ఉమెన్ సేప్టీ క్లబ్, 4) యాంటి ర్యాగింగ్ మరియు యాంటి డ్రగ్ కమిటీ క్లబ్, 5) సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్, 6) హెల్త్ అండ్ వెల్నెస్ క్లబ్ ఉన్నాయి. ఒక్కో క్లబ్లో ఆరుగురు విద్యార్థులు, నలుగురు తల్లిదండ్రులు, ఒక కాలేజ్ లెక్చరర్ మెంబర్లుగా ఉంటారు. అన్ని కాలేజీల్లో కలిపి 1000 మందికిపైగా సభ్యులుగాఉన్నారు.