కామారెడ్డి జిల్లాలో భూతగాదాలు మరోసారి భగ్గుమన్నాయి. రాజంపేట్లో వ్యవసాయ బావి దగ్గర భూమిలో దారి కోసం రెండు వర్గాల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతుండగా..జులై 02వ తేదీ సోమవారం మరోసారి రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది.
Also Read : కార్గిల్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదు
రాజంపేట్లో నాయిని జ్యోతి, నాయిని శ్రీనివాస్ కు వ్యవసాయ బావి వద్ద భూమిలో దారి కోసం గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ భూమి దున్నుతుండగా జ్యోతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కర్రలు,రాడ్లతో శ్రీనివాస్పై దాడి చేశారు. ఈ కేసు విషయంలో పోలీసులు 10 మందిని రిమాండ్ చేశారు. అయితే ఈ వివాదంలో షూరిటి ఉన్నందున సుగుణ భర్త ముదాం సాగర్ను పోలీసులు విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. విచారణ పేరుతో ముదం సాగర్ను చితకబాదారని భార్య సుగుణ, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
చికిత్స నిమిత్తం మదాం సాగర్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.