పోలీస్ స్టేషన్లో సైకో వీరంగం..సిబ్బందిపై కత్తితో దాడి

 పోలీస్ స్టేషన్లో సైకో వీరంగం..సిబ్బందిపై కత్తితో దాడి
  • కామారెడ్డి జిల్లాలో  ఘటన

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ లో మద్యం మత్తులో  ఓ సైకో వీరంగం సృష్టించాడు. పోలీసులపై దాడికి పాల్పడ్డాడు.  రవి అనే వ్యక్తి తన తల్లిదండ్రులను వేధిస్తున్నాడని రాత్రి 100 డయల్ కి ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో రవిని పీఎస్​కు తీసుకువచ్చారు.  నిన్న అర్ధరాత్రి2 గంటల సమయంలో రవిని పోలీసులు సముదాయిస్తున్న సమయంలో  డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్ సిద్ధ రాములు,డ్రైవర్ తో రవి గొడవకు దిగాడు.

స్టేషన్ లో ఉన్న అద్దాలను, డోర్,ఫర్నీచర్ ను ధ్వంసం చేశాడు. రవిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తన వద్ద ఉన్న చిన్న కత్తితో వారిపై  రవి దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్​ సిద్ధిరాములుకు  గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు పొలీసులు తరలించారు.