మూడు గంటల పాటు హంగామా
కామారెడ్డి టౌన్, వెలుగు: తన భూమిని కొందరు కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలంటూ బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌజ్వద్ద ఉన్న సెల్టవర్ఎక్కి టౌన్‌కు చెందిన బెజుగాం ఓంకార్ మూడు గంటల పాటు హంగామా చేశాడు. పోలీసులు, ఫైర్‌సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఓంకర్ను కిందికి దిగాలని నచ్చజెప్పారు. టౌన్‌సీఐ నరేశ్ బాధితుడితో ఫోన్లో మాట్లాడారు. అతడి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మూడు గంటల తర్వాత ఓంకార్ టవర్ దిగివచ్చాడు. అతడు మాట్లాడుతూ.. పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదుట తనకు ఎకరం 10 గుంటల భూమి ఉందని, అందులో 10 గుంటల భూమిని కొందరు కబ్జా చేశారన్నారు. కోర్టులో కేసు కూడా నడుస్తోందని, ల్యాండ్ దగరకు వెళ్తే, కబ్జా చేసిన వారు కొట్టారన్నారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా లాభం లేకుండా పోయిందని వాపోయారు. అందుకే సెల్టవర్ఎక్కి నిరసన తెలిపినట్లు పేర్కొన్నాడు. ఆఫీసర్లు తనకు న్యాయం చేయాలని కోరాడు. అనంతరం బాధితుడిని పోలీసులు ఠానాకు తరలించారు.