కామారెడ్డి టౌన్, భిక్కనూరు, వెలుగు: కామారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం అకాల వర్షంకురిసింది. పలు ఏరియాల్లో బలమైన ఈదురు గాలులు వీయడంతో కరెంట్ సప్లయ్ నిలిచిపోయింది. కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ మండలాలతో పాటు జిల్లా కేంద్రంలో కూడా భారీ వర్షం పడింది. గాంధీ గంజులో ఆరబోసిన వడ్ల కుప్పలు తడిసిపోయాయి. వరద నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి.
వరద నీటి నుంచి రైతులు వడ్లను ఎత్తుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. భిక్కనూరు, కామారెడ్డి, దోమకొండ మండలాల్లోని పలు గ్రామాల్లో అకాల వర్షంతో సెంటర్లలో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. భిక్కనూరు, రాజంపేట మండలాల్లో కరంటు సప్లయ్ నిలిచిపోయింది. పలు మండలాల్లో వాన లేనప్పటికీ బలమైన ఈదురు గాలులు వీచాయి.