కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్​రెడ్డికి వీడ్కోలు

కామారెడ్డి టౌన్, వెలుగు: బదిలీపై వెళ్తున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ బి. శ్రీనివాస్​రెడ్డిని గురువారం జిల్లా పోలీసులు వీడ్కోలు పలికారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. తాను మొదట జిల్లాలోని బాన్సువాడ లో ఎస్ఐగా విధుల్లో చేరానని, మొదటి పోస్టింగ్​అందుకున్న జిల్లాలోనే 22 నెలల పాటు ఎస్పీగా పనిచేయడం  సంతోషానిచ్చిందన్నారు.

Also Read : దసరా పండుగకు ఆర్టీసి ప్రత్యేక బస్సులు

ఎస్పీగా జిల్లా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. ఇన్​చార్జి ఎస్పీ నర్సింహారెడ్డి,  డీఎస్పీలు మదన్​లాల్, ప్రకాశ్, శ్రీనివాస్, జగన్నాథ్​రెడ్డి, ఎస్ బీ సీఐలు చంద్రశేఖర్​రెడ్డి, సంతోష్​, జిల్లాలోని సీఐలు, ఎస్​ఐలు పాల్గొన్నారు.