అసంపూర్తి పనులతో తిప్పలు

కామారెడ్డి, వెలుగు: రాజంపేట మండలం కొండాపూర్,​- ఎల్లారెడ్డిపేట మధ్య ఆర్అండ్​బీ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం పనులు కంప్లీట్  అయ్యాయి. బ్రిడ్జికి ఇరు వైపులా బీటీ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ రోడ్డుపై వెళ్లే వారు మట్టి రోడ్డుపై దుమ్ము లేస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని బీటీ పనులు కంప్లీట్​ చేయాలని స్థానికులు కోరుతున్నారు.